మార్క్సిస్ట్, లెనినిస్ట్ సిద్ధాంతాల విశ్లేషణ, భారతదేశ ఆర్థిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని తరిమెల నాగిరెడ్డి ఈ గ్రంథాన్ని రాశారు. ఈయనను టి.ఎన్. అని కూడా పిలుస్తారు. పుచ్చలపల్లి సుందరయ్య ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే గ్రంథాన్ని రాశారు. చండ్ర రాజేశ్వరరావును సి.ఆర్. అని ముద్దుగా పిలిచేవారు. దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సారస్వత పరిషత్లో కీలక పాత్ర పోషించారు. సారస్వత నవనీతం, వేగుచుక్కలు మొదలగు రచనలు చేశారు.