రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్లెమెంట్ అట్లీ ప్రధాని అయ్యాడు. భారతదేశ చివరి వైశ్రాయి అయిన లార్డ్ మౌంట్ బాటెన్ 1947 జూన్ 3న ఒక ప్రణాళికను రూపొందించాడు. దీనినే కొద్ది మార్పులతో బ్రిటన్ పార్లమెంట్ 1947 జూలై 18వ తేదీన ఆమోదించింది. 1947 ఆగస్ట్ 14న పాకిస్తాన్ అవతరించింది. 1947 ఆగస్ట్ 15న భారత్ స్వాతంత్య్రాన్ని పొందింది.