మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపాన ఉన్న పౌనార్ నది ఒడ్డున వార్థా ఆశ్రమాన్ని నిర్మించారు. జమన్లాల్ బజాజ్ అనే ప్రముఖ వ్యాపారి ధన సహాయంతో ఇది నిర్మితమైంది. 1937లో గాంధీజీ వార్థా ఆశ్రమం నుంచే ‘బేసిక్ ఎడ్యుకేషన్’ను ప్రకటించాడు. జాతీయోద్యమంలో వార్థా ఆశ్రమం గణనీయమైన పాత్ర పోషించింది. ఉప్పు సత్యాగ్రహం అనంతరం గాంధీజీ తన కార్యక్రమాలకు వార్థా ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకున్నాడు.