దరశామ (దర్శన) ఉప్పుడిపోపై దాడిచేసి ఆంగ్లేయుల చట్టాలను ఉల్లంఘించింది సరోజినీ నాయుడు. ఈమెను ‘భారత కోకిల’ అని వ్యవహరిస్తారు. ఈమె జన్మదినాన్ని ‘జాతీయ మహిళా దినోత్సవం’గా ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్, ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత (1925–కాన్పూర్ ఐఎన్సీ) సరోజినీ నాయుడు.