ఆర్య సమాజం కార్యకలాపాలలో సాంఘిక శుద్ధి ఉద్యమం కీలకమైంది. అన్యమతాలవారు హిందువులను తమ మతంలోకి మార్చుచున్నారు. కాబట్టి తిరిగి వారిని స్వమతం అయిన హిందూ మతంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించిబడింది. దయానంద సరస్వతి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, తెలుగు నేలలో రఘుపతి వెంకటరత్నం నాయుడు నిర్వహించాడు.