క్రీ.శ.1898లో మద్రాస్‌లో ‘భారత సంఘ సంస్కరణల’ సభ జరిగింది. ఈ సంస్థను 1870లో కేశవ్ చంద్రసేన్ స్థాపించారు. మహదేవ్గోవిందరనడే మద్రాస్ సభలో మాట్లాడుతూ ‘దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్’ అని కందుకూరి వీరేశలింగంను పొగిడారు. ఈ సభకు అధ్యక్షుడు కందుకూరి వీరేశలింగం. సమాజ ఉద్ధరణ ఈ సంస్థ లక్ష్యం.