Concept:కంద పద్యంలో ఉపయోగించే గణాల లక్షణాలను గుర్తించడమే ఈ ప్రశ్న యొక్క ప్రధానాంశం.
Explanation:కంద పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
దీనిలోని గణాలన్నీ నాలుగు మాత్రల గణాలు మాత్రమే అవుతాయి.
ఆ గణాలు: గగ, భ, జ, స, నల.
1,3 పాదాలలో గణాల సంఖ్య
=3.
2,4 పాదాలలో గణాల సంఖ్య
=5.
1,3 పాదాలలో
1,3 గణాలు జ గణం కాకూడదు.
2,4 పాదాలలో
2,4 గణాలు జ గణం కాకూడదు.
2,4 పాదాలలో యతికి ముందు వచ్చే
3వ గణం జ లేదా నల అయి ఉండాలి.
2,4 పాదాల చివరి అక్షరం గురువు కావాలి.
కాబట్టి చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.
అందువల్ల కంద పద్యంలోని గణాలు గగ, భ, జ, స, నల అని నిర్ధారించవచ్చు.
Answer:సరైన సమాధానం: B. గగ, భ, జ, స, నల.