Test Index
Telangana TET Paper 1 Exam Model Paper 2
Show Para
Question Numbers: 39-45సూచన : ఈ క్రింది ఇవ్వబడిన వ్యాస భాగమును చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.ప్రాచీన స్వాహిలీ సాహిత్యంపై అరబ్బీ మత సంబంధ కావ్యాల ప్రభావం ప్రస్పుటంగా కనిపిస్తూంది. మతబోధ, ఉపదేశం ఈ గ్రంథాల లక్ష్యం. మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు ఈ కావ్యాల ఇతివృత్తాలు. అయిదరూస్ అనే స్వాహిలీ కవి అరబ్బీ మూలం నుంచి 1652 లో అనువాదం చేసిన ఆల్ హ మీజియా అనే గ్రంథం స్వాహిలీ భాషలో లభ్యమైన మొదటి వ్రాతప్రతి. 17 వ శతాబ్దంలోనే లియోంగో పుమోస్వాహిలీ భాషలో మొదటి స్వతంత్ర రచన చేశాడు. ప్రాచీన స్వాహిలీ సాహిత్యంలో ఉతెండీవా తంబూకా (1728) అనే కావ్యం ప్రముఖమైంది. ఈ కావ్యం సుల్తాన్ లైతినభాని కోసం రచింపబడింది. కవి పేరు గ్రంథస్తం కాలేదు. బకారిలో మొహమ్మద్ బిన్ ఆల్ బుకర్ బిన్ ఉమన్ ఉతేండివా లియోంగో పుమో (1913) అనే ఇతిహాస కావ్యాన్ని రచించాడు. 18వ శతాబ్దంలో బ్వానామేన్గో రచించిన 'హెరాక్లియోస్' ఇతిహాసం ప్రసిద్ధి చెందిన కావ్యం. 19 వ శతాబ్ధంలో మొంబాసా తూర్పు ఆఫ్రికాకు సంస్కృతి కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడ మయూకా అనే కవి అత్యంత బావుక శక్తితో, రాజకీయ అధిక్షేపణతో కవిత్య సృష్టి చేశాడు. ప్రాచీన స్వాహిలీ మౌఖిక సంప్రదాయం ద్వారా తరతరాలుగా పరిరక్షించబడింది.20 వ శతాబ్దంలో టాంజేనియాలోను, కీన్యాలోనూ, ఉగాండాలోనూ స్వాహిలీ సాహిత్యం నవలా రంగంలోను, నాటకరంగంలోను బహుముఖంగా వృద్ధి చెందుతుంది.షాబాన్ రాబర్ట్ (1909-1962) స్వాహిలీ కవిత్వ రంగంలో సుప్రసిద్ధుడు. ఆయన టాంగా (టాంగాన్యీకా) లో జన్మించి స్వాహిలీ శబ్దాలపై అద్వితీయమైన అధికారాన్ని సంపాదించాడు. నవలలు, వ్యాసాలు, కావ్యాలు, స్వీయ చరిత్ర అన్ని రంగాల లోనూ ఆయన ప్రశంసనీయమైన కృషి చేశారు. రంగి జేటు (మా రంగులు), కిస్వామిలీ (స్వాహిలీ) ఆయన కవితలలో చీరస్మరణీయమైనవి. రంగు విశ్వజనీనమైనదనీ, తన భాష తనకత్యంత ప్రీతిపాత్రమైందనీ, ఈ కవితలలో ఆయన వెల్లడించారు.మటియాసి మ్యామ్పాలా (1909-69) టాంజేనియాకు చెందిన ప్రసిద్ధి కవి. ఆయన రచించిన 'యుటెంజివా ఎంజెలి' 'టకాటిటు' (Epic of the holy Gospel) మత సంబంద గ్రంథాలలో ముఖ్యమైంది.గ్రేస్ ఓ గోట్ కి కథానికా రచయిత్రిగా, నవలా రచయిత్రిగా ప్రాముఖ్య స్థానం ఉంది. ఉరుము లేని భూమి (1968), మరో ఆవిడ (1976), భాష్ప ద్వీపం (1980) ఆమె రచించిన నవలలలో ముఖ్యమైనవి. వ్యంగ్యధోరణి, అధిక్షేపణ ఆమె నవలలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. కొన్ని కథలు స్థానిక గాథలపై ఆధారపడినవి.
© examsnet.com
Question : 41 of 150
Marks:
+1,
-0
Go to Question: