Concept:సమాసంలోని రెండు పదాల అర్థం కాకుండా, వేరొక వ్యక్తిని లేదా వస్తువును సూచించే సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు.
Explanation:‘కమాలాక్షుడు’ అనేది ‘కమలముల వంటి కన్నులు కలవాడు’ అనే అర్థాన్ని ఇస్తుంది.
దీనిలో కమలం కాని, అక్షి కాని ప్రధానం కాదు. ఈ రెండు పదాల ద్వారా విష్ణుమూర్తి అనే వేరొక అర్థం ప్రధానమైంది.
అందుకే ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. ఇతర సమాసాలను పోల్చి చూడండి:
- ద్వంద్వ సమాసం: రెండు పదాలకు సమ ప్రాధాన్యత. ఉదా: సూర్యచంద్రులు.
- సంభావనా పూర్వపద కర్మధారయం: పూర్వపదం సంజ్ఞావాచకం. ఉదా: ద్వారకానగరం.
- రూపక సమాసం: ఉపమేయానికి ఉపమానానికి అభేదం. ఉదా: విద్యాధనం (విద్య అనెడి ధనం).
‘కమాలాక్షుడు’లో అన్యపదార్థ ప్రాధాన్యం ఉండటం వల్ల ఇది బహువ్రీహి సమాసం.
Answer:B. బహువ్రీహి సమాసము