అనీబిసెంట్ ఐర్లాండ్ దేశస్థురాలు. ఈమె దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధురాలిగా భారత్ వచ్చి, క్రియాశీల రాజకీయాలలో పాల్గొని భారతీయులను చైతన్యపరిచింది. 1916 సెప్టెంబర్ 15న హోంరూల్ ఉద్యమాన్ని మద్రాస్‌లో ప్రారంభించి, దాని కోసం హోంరూల్ లీగ్‌ను ప్రారంభించింది. స్వయంపాలన లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. జాతీయ కళాశాలలను ప్రారంభించి చైతన్యపరిచింది. కామన్వీల్, న్యూ ఇండియా వంటి పత్రికలను స్థాపించింది. అనీబిసెంట్‌ను ఊటీలో అరెస్ట్ చేసి, కోయంబత్తూర్‌లో జైలులో నిర్భంధించారు. 1917 ఐఎన్సీకి కలకత్తాలో అధ్యక్షత వహించారు. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ, విదేశీ మహిళ ఈమే.