ఎన్.ఎం. జోషి నేతృత్వంలో 1920, అక్టోబర్ 31న ‘అఖిలభారత కార్మిక కాంగ్రెస్’ను స్థాపించారు. దీనినే ఆంగ్లంలో ‘ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్’ అంటారు. సంక్షిప్తంగా ఏఐటీయూసీ అంటారు. దీని తొలి అధ్యక్షుడు లాలాలజపతిరాయ్. 1921లో వేల్స్ రాకుమారుడు భారత పర్యటనను ఈ కార్మిక సంస్థ బహిష్కరించింది. 1926లో బ్రిటిష్ ప్రభుత్వం కార్మిక సంఘాల చట్టాన్ని చేసింది.