1945 నవంబర్ 5 నుంచి 11 తేదీ మధ్య బ్రిటిష్‌వారు ఢిల్లీలోని ఎర్రకోటలో విచారించారు. షానవాజ్‌ఖాన్, ప్రేమ్ సెహగల్, గురు భ„Š సింగ్ ధిల్లాన్‌లను విచారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ ప్రముఖుల తరపున తేజ్ బహదూర్ సప్రూ, జవహర్లాల్ నెహ్రూ, బూలాభాయ్ దేశాయ్, కైలాష్‌నాథ్ ఖట్జూ, అసఫ్ అలీ లాంటి న్యాయ నిపుణులు వాదించారు. ప్రజాగ్రహానికి లొంగిన ఆనాటి భారత సైన్యాధ్యక్షుడు అచిన్లేక్ వారి శిక్షలు రద్దు చేశారు.