సహాయనిరాకరణోద్యమం జరుగుతున్న కాలంలో గాంధీజీ అహింసా సిద్ధాంతంతో జాతి యావత్తూ ముందుకుపోతుంటే ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ జిల్లాలోని చౌరీచౌరా అనే ప్రాంతంలో 1922 ఫిబ్రవరి 5న ప్రజలు ఊరేగింపు జరుపుతూ ఉండగా పోలీసులు ప్రజలను కవ్వించడంతో ప్రజలు ఆగ్రహానికి గురై పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు. 22 మంది పోలీసులు, ముగ్గురు సామాన్య ప్రజలు మరణించారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ 1922 ఫిబ్రవరి 22న ఉద్యమాన్ని నిలిపి వేశారు.