1919 ఏప్రిల్ 13న పంజాబ్లో జలియన్ వాలాబాగ్లో అనేక మంది భారతీయులను కాల్చి చంపారు. ఈ సంఘటనకు చింతిస్తూ దామరాజు పుండరీకాక్షుడు ‘పంచాల పరాభవం’ అనే నాటకం రాశారు. పాంచాలం లేదా పాంచాల అంటే ‘పంజాబ్’. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గేయకర్త గరిమెళ్ల సత్యన్నారాయణ. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను సురవరం ప్రతాపరెడ్డి రాశారు. ‘నేను–నా దేశం’ను దర్శి చెంచయ్య రాశారు.