క్రీ.శ. 1931లో హెచ్.ఎం.రెడ్డిగారు తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రథమంగా భక్తప్రహ్లాద అనే తొలి తెలుగు టాకీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని అర్థాంగి లీలావతిగా సురభి కమలాభాయి మొదలగువారు నటించారు. భీష్మప్రతిజ్ఞ తెలుగు నేలలో తొలి మూకీ చిత్రం. మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాలు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన చిత్రాలు.