క్రీ.శ. 1853లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ డల్హౌసీ తొలి రైలును ప్రవేశపెట్టాడు. ఇది ముంబాయి నుంచి థానే ప్రాంతాల మధ్య నడిచింది. 1856లో దక్షిణ భారతదేశంలో తొలి రైలు మద్రాస్ నుంచి అరక్కోణం మధ్య నడిచింది. 1862లో తొలి రైలు పుత్తూరు నుంచి రేణిగుంట ప్రాంతాల మధ్య నడిచింది. బ్రిటీష్ వారి రవాణా కోసం ఆ మార్గాలను ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా కలప, ఇనుములాంటి ఖనిజాలు, ఆయుధాలు, వస్తువులు రైళ్ళ ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించేవారు.