గ్రీక్ దేశ తత్వవేత్త సోక్రటీస్తో రఘుపతి వెంకటరత్నం నాయుడిని పోలుస్తారు. ధనుర్విద్యా ప్రవీణుడైన ఎ.రామమూర్తిని కలియుగార్జున అంటారు. సర్కస్ కంపెనీ స్థాపకుడైన కోడి రామమూర్తిని ‘కలియుగభీమ’, మల్ల మార్తాండ మొదలగు బిరుదులతో కీర్తిస్తారు. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయులకు సహకరించినందుకు అఫ్జల్ ఉద్ధౌలా అనే హైదరాబాద్ నిజాంకు ‘స్టార్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదు ఇచ్చారు ఆంగ్లేయులు.