ఫ్రెంచ్ సేనాని అయిన రేమండ్ గతంలో కొంతకాలం టిప్పు సుల్తాన్ కొలువులోనూ, కొంతకాలం బుస్సీకి అంగరక్షకుడుగా ఉన్నాడు. నిజాం ఆలీఖాన్ ఆంగ్లేయులను కాదని ఫ్రెంచ్ సేనాని రేమాండ్ సహాయంతో తన సైన్యాన్ని పటిష్టపరచుకొన్నాడు. నేటి హైదరాబాద్‌లోని గన్ ఫౌండ్రీలో రేమండ్ నెలకొల్పిన తుపాకుల కర్మాగారం అవశేషాలు కన్పిస్తాయి. స్థానికులు ఈయనను ‘ముసారాం’ అనేవారు. మలక్‌పేటలో ఈయన సమాధి ఉంది.