విష్ణుకుండినులు వివిధ ప్రాంతాలలో తమ శిల్పకళలు విస్తృతపరిచారు. అర్ధనారీశ్వరుడు అంటే శివుడు స్త్రీ, పురుష భంగిమలో కనిపిస్తాడు, దుర్గమాతకు మూడు ముఖాలతో భైరవకోనలో శిల్పీకరణ చూపరులను ఆకట్టుకుంటుంది. ఉండవల్లిలో ఉన్న పూర్ణకుంభంను చూసి సూరిశెట్టి ఆంజనేయులు చిత్రీకరించారు. దీనినే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చిహ్నంగా స్వీకరించారు. (ఇప్పుడు పూర్ణఘటం). బొజ్జన్నకొండలో బుద్దుణ్ణి బొజ్జన్న అని పిలుస్తారు.