హస్తి అంటే ఏనుగు లేదా గజరాజు. ఈ రకమైన దళాన్ని హస్తికోశ అని పిలుస్తారు. ఈ ఏనుగుల దళం యుద్ధ సమయాలలో అత్యంత కీలకమైన దళం. వీరకోశ అంటే పదాతి దళం. స్కంధావారం అంటే శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరం, గుల్మిక అంటే సరిహద్దు రక్షణాధికారి అని శాతవాహనుల కాలం వివరాల ద్వారా తెలుస్తుంది.