కార్నేలియా సోరాబ్జీ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి పట్టబద్దురాలైన తొలి మహిళ. ఈమె భారత్లో తొలి మహిళా న్యాయమూర్తి. ఈమె బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో చదివిన తొలి భారతీయ వనిత. భానూ జహంగీర్కోయాజీ జనాభా నియంత్రణ ఉద్యమకారిణి. కాదింబినీ గంగూలీ కలకత్తా విశ్వవిద్యాలయంలో పట్టా పొందిన తొలి మహిళ, ఐఎన్సీ సమావేశాలకు హాజరైన తొలి మహిళ. ఆర్.ఎస్. సుబ్బులక్ష్మి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తొలి మహిళ.