హైదరాబాద్ సంస్థానంలో సంఘసంస్కర్తగా కీర్తివహించిన మాదిరి భాగ్యరెడ్డివర్మ 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించారు. దీని ప్రధాన ఉద్దేశం అణగారిన వర్గాల వారికి విద్య నేర్పించుట. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి అనే రచన చేశాడు. కుసుమధర్మన్న ‘మాకొద్దీ నల్లదొరతనం’ అనే నినాదం ఇచ్చాడు. బోయి జంగయ్య ‘జాతర’ అనే రచన చేశాడు. వీరందరూ సంఘసంస్కరణలకు కృషిచేశారు.