మాగల్లు దాన తామ్ర శాసనం: కాకత్య గుండ్యన కోరిక మేరకు తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడు ఓ బ్రాహ్మణుడికి మాగల్లు గ్రామాన్ని దానం చేసిన విషయాన్ని తెలుపుతుంది.గణపతిదేవుని మొగలుట్ల దాన తామ్ర శాసనం: రాజు కూతురు కోట గణపాంబ వేసిన శాసనం మొగలుట్ల గ్రామాన్ని ఓ బ్రాహ్మణుడికి దానం చేయడాన్ని ఇందులో పేర్కొన్నారు.ఉత్తరేశ్వర దాన తామ్ర శాసనం: ప్రతాపరుద్రుడి మంత్రి చాళుక్య ఇందుశేఖరుడు ఉత్తరేశ్వర గ్రామాన్ని విద్దనాచార్య బ్రాహ్మణునికి దానమివ్వడం గురించి తెలుపుతుంది.చమ్మక్ తామ్ర శాసనం: రెండో ప్రవరసేనుడు వేయించిన ఈ చమ్మక్ తామ్ర శాసనం వేయి బ్రాహ్మణులకు చేసిన గ్రామ దానాలను గురించి వివరిస్తుంది.