AP TET Paper 2 Math and Science Model Paper 2 (తెలుగు)

Show Para  Hide Para 
ప్రశ్నలు (36-40)
ఈ కింది వ్యాసం చదివి సమాధానాలు రాయండి
శిశువుడికి పశుపతి అని పేరుంది. ఆ పేరు మీదుగానే పాశుపతం అనే శైవశాఖ బయలుదేరింది. దాని ప్రారంభకుడు సాక్షాత్తు శివుడేనని సంప్రదాయం. శిశువుడు ఒక మృత శరీరంలో ప్రవేశించి పునర్జీవింపచేశాడట. అతడు లకులీశుడు అనే పేరుతో తిరిగి జీవించాడు. అది శివుడు ఎత్తిన ఆఖరి మానవావతారమట. ఆ లకులీశనతారంలో శివుడే పాశుపత మత ప్రచారం చేశాడట. ఉత్తర భారతంలో కొన్నిచోట్ల పాశుపత దేవాలయాల్లో దిగంబరుడైన ఒక యోగి ఒక దండాన్ని (లకుటం) ఎడమ చేతితో ధరించి, అతని మర్మాంగం నిక్కబొడుచుకొని ఉన్నట్లు కనిపించే విగ్రహాలున్నాయట. ఆ యోగి లకులీశుడేనని పండితుల అభిప్రాయం.
పాశుపత మతంపై సాంఖ్యదర్శన (ప్రభావం ఉంది. ఆ మతంలో శివుడు సర్వస్వతంత్రతత్వం కాగా, ప్రకృతి, పురుషులు శివునిపై ఆధారపడిన తత్వాలు. ముక్తజీవులు శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారు. యోగ దర్శనంలో ముఖ్యమైన యమ, నియమాదులు పాశుపతానికి కూడా ముఖ్యమే. జీవుని దుఃఖాన్ని శాశ్వతంగా నివారించడం ఈ మతం ధ్యేయం. ఇందుకు అయిదు దశలను సాధకుడు అధిగమించాలి. మొదటి దశలో సాధకుడు దిగంబరంగా, ఒడిలికి బూడిదను రోజుకు మూడుసార్లు అలుముకొని సంచరిస్తూ, శివున్ని పూజిస్తూ శివ తాండవాన్ని అనుకరించి నాట్యం చేయాలి. రెండో దశలో ఇవన్నీ మానేసి ఉన్మాదిలా సంచరిస్తూ అందరూ అసహ్యించుకునేలా ఉండాలి. మిగిలిన దశల్లో కూడా కఠోర నియమాలను అనుష్టిస్తూ, శ్మశానాలలో తిరుగుతూ ఇంద్రియాలను జయించి ప్రాపంచిక బంధాలన్నిటిని తెంచుకోవాలి. ఆ విధంగా చేస్తుంటే చివరికి అతడు శివునిలా ద్విదేహం పొంది దివ్య మహిమలు సంపాదించి సర్వశక్తి సంపన్నడవుతాడని పాశుపతుల నమ్మకం.
© examsnet.com
Question : 36
Total: 150
Go to Question: