AP TET Paper 2 Math and Science Model Paper 3 (తెలుగు)

Show Para  Hide Para 
ప్రశ్నలు (36-40): కింది వ్యాసం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
క్రీ.శ. 19-24 నడుమ రాజ్యము చేసిన హాలశాతవాహన చక్రవర్తి కాలము ప్రాకృత వాజ్మయమున స్వర్గయుగమని చెప్పనొప్పును. ఈతని యాస్థానమునే గథా సప్తశతియను ప్రాకృత కావ్యం కూర్చబడెను.లీలావతి అనే మరియొక్క ప్రాకృత కావ్య ఈ సమయముననె వెలిసెను. హాలశాత వాహన రాజు సింహకళరాజు పుత్రియైన లీలావతిని ప్రేమించి పెండ్లి యాడుట దీనిలోని ఇతివృత్తము. దీనికి కార్యరంగము సప్త గోదావరి తీరమున ప్రసిద్ధి గాంచిన భీమేశ్వర క్షేత్రము. హాలుడు అశ్మక రాజ్యమునందలి ప్రతిష్థానము నేలుచుండినట్లు లీలావతి కావ్యం వర్ణించుచున్నది. దీన్ని కన్న జగద్విఖ్యాతమైన కావ్యము గాథాసప్తశతి. ఇందు అత్యంత సుందరములను, హోమములు అను ఏడు వందల బంగారు గాథలు కలవు. గాభ యన ప్రాకృత పద్యము. ఈ పద్యము ఒక దానితో ఒకటి సంబంధించినవి కాక స్వతంత్రములు. గాథలను రచించిన కవులును అనేకులున్నారు. శాలివాహన 'సప్తశతి' అని పేరు దీని కుండుటచే ఈ కావ్యమంతయు హాలుడు రాసినదని తలపరాదు. హలచక్రవర్తి స్వయముగా విద్వాంసుడును, రసికుడినై కొన్ని గాథలను తాను లిఖించెను. హాలుని ఆస్థానంను సందర్శించిన కవివరేణ్యులు చెప్పిన గాథలే అధిక సంఖ్యలో వున్నవి. వీనిలో మిక్కిలి రమణీయమైన వాని నేర్చికూర్చి శ్రీ పాలితుడను మహాకవి సప్తశతిగా రూపొందించెనని తెలియుచున్నది.గాథలను రచించిన వారిలో పురుషులె గాక స్త్రీలు వుండుట ప్రశంసనీయము. కవయిత్రులలో అణులక్ష్మీ,అనుపలబ్బ, రేప, మాధవి మొదలగు మహానీమనుల రచనలు గాథా సప్తశతిలో స్థానం నలంకరించినవి.ఇట్లనేక మంది కవుల కాశ్రయమిచ్చినందున హాలునకు కవివత్సలుడు అనే ఖ్యాతీ కలిగెను. ఆ కాలపు సాంఘిక జీవితం తత్రాపి కల్లాకపటము లెరుగని గ్రామీణుల ప్రేమ విలాసములు ఈ పద్యములందు అద్దమునందు వలె ప్రతిఫలించినవి. ఇందు శృంగారమే ప్రధాన రసమైనను గాథలు సభ్యరుచికి దూరముగాకుండా ఉన్నవని పండితులు ప్రశంసింతురు.
© examsnet.com
Question : 36
Total: 150
Go to Question: