Show Para
ప్రశ్నలు (35-38)
ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కార్గిల్ ఒక జిల్లా. దీన్ని భారతదేశానికి, పాకిస్థాన్‌కు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ముఖ్యపట్టణంగా పేర్కొంటారు. కార్గిల్ యుద్ధం భారత్ - పాక్‌ల మధ్య జరిగింది. భారతదేశంలో అక్రమంగా చొరబడి అల్లకల్లోలం సృష్టించడానికి పాక్ కిరాయి సైనికులను నియమించింది.
ఈ దురాక్రమణదారులు 'తోలోలింగ్', 'టైగర్ హిల్' వంటి ప్రసిద్ధ పర్వతాలకు నిలయమైన ద్రాస్ ప్రాంతాన్ని ఎంచుకొన్నారు. సాధారణంగా చలికాలంలో ఇక్కడ భారత్ సైనికులు కాపలాను తక్కువ స్థాయికి పరిమితం చేస్తారు. ఇలా కాపలా తక్కువగా ఉన్న సమయంలో పాక్ సైనికులు తమకు తగిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకొని యుద్దానికి తలపడ్డారు.
ఈ పోరాటంలో భారత సైనికులు, సైనికాధికారులు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. కొన్ని వందలమంది ప్రాణాలు కోల్పోయారు. అనేక వందలమంది క్షతగాత్రులయ్యారు. కిరాయి హంతకులు ముందుగానే మన సైన్యం దాడులను ఊహించి మందుపాతర్లను సైతం మంచుకొండల్లో అమర్చి మనవారికి తీవ్రనష్టం కలిగించారు. అయినప్పటికీ మనసైన్యం వీరోచితంగా పోరాడి వారిని భారతదేశ సరిహద్దు ప్రాంతాల నుంచి తరిమికొట్టడంలో అపూర్వ విజయం సాధించింది.
మన సైన్యానికి అండగా ప్రజలంతా సమైక్యంగా నిలిచారు. అన్ని వర్గాల వారు సంపూర్ణంగా సహకరించారు. 'మేరా భారత్ మహాన్ అనే నినాదాన్ని భారత ప్రజలు మరొక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి కార్గిల్ పోరాటం తోడ్పడింది. ఇది ఇలా ఉంటే అసలే అంతంత మాత్రంగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థకు కార్గిల్ పోరాటం ఒక రకంగా దెబ్బేనని చెప్పవచ్చు.

Go to Question: