Show Para
ప్రశ్నలు (35-38)
“ఆరోగ్యమే మహాభాగ్యం” అని నానుడి. గొప్పగా ధనం సంపాదించడం కన్నా మంచి ఆరోగ్యం ఉండటం చాలా ఉత్తమమని పెద్దలు చెబుతారు. ప్రతి పౌరుడు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఆ ఆశయంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం 1998 సెప్టెంబర్ 10వ తేదీన 'పచ్చదనం- పరిశుభ్రత' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం, మంచినీరు, మొక్కలు నాటడం, ఆరోగ్యం వంటి ముఖ్యమైన విషయాలకు మన ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి వ్యక్తి తన ఇంటినీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఊరంతా శుభ్రంగా ఉంటుంది. గ్రామంలోని వారంతా ఆరోగ్యంగా జీవించవచ్చు.
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, కర్మాగారాలు మొదలైన పరిసరాలలో మొక్కలను పెంచి వాతావరణ కాలుష్య నిర్మూలనకు ప్రయత్నించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మాసంలో మూడవ శనివారం “పచ్చదనం- పరిశుభ్రత' కార్యక్రమాన్నిచేపట్టేటట్లు అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాలు ప్రత్యేకమైన శ్రద్ధతో 'పచ్చదనం- పరిశుభ్రత' కార్యక్రమంలో లీనమైపోతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సామాన్య మానవుని వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములై రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు.
ఈ 'పచ్చదనం- పరిశుభ్రత' కార్యక్రమంలో ఎవరికి వారే స్వచ్ళందంగా పాల్గొని పరిసరాల కాలుష్య నివారణకు తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

© examsnet.com
Question : 36
Total: 150
Go to Question: