ప్రాచీన కాలంలో మొదటి మహాసామ్రాజ్యం మగధ, ఇది మౌర్యుల పాలనా కాలం వరకు అర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. శ్రేణులు వ్యవస్థీకృతం అయ్యాయి. రోమ్ మొదలైన దేశాలతో విదేశీ వ్యాపారం అందుబాటులోకి రావడంతో నాణేలను ప్రవేశపెట్టారు.