తొలి గుప్తరాజుల బంగారు నాణేలు కుషాణుల బంగారు నాణేల ప్రామాణిక తూకంపై ఆధారపడి ముద్రించారు. కుషాణులు నాణేలు ముద్రించేందుకు రోమ్ చక్రవర్తులకు చెందిన ’అరై’ బంగారు నాణేల ప్రామాణిక తూకాన్ని అనుసరించారు. స్కందగుప్తుడు మాత్రం ఈ పద్దతిని మార్చి 80 రత్తిలు లేదా 144 గురివింద గింజల భారతీయ సువర్ణ నాణేల ప్రామాణిక తూకాన్ని వాడాడు.