‘కమ్యూనిస్ట్ గాంధీ’ అని పిలువబడిన పుచ్చలపల్లి సుందరయ్య ‘తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్’ అనే గ్రంథాన్ని రాశారు. అందులో అప్పటి సమకాలీన పరిస్థితులు, పార్టీ విధానాలు, పోరాట క్రమాన్నీ విశదీకరించారు. ఈయనను ‘కామ్రేడ్ పి.ఎస్’ అని పిలిచేవారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే గ్రంథాన్ని కూడా ఈయన రాశాడు.