తెలుగు భాషాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి, గ్రంథ ప్రచురణలకు గ్రంథాలయోద్యమానికి కొంతమంది మేథావులు దోహదం చేశారు. 1904లో హన్మకొండలో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయాన్ని స్థాపించారు. 1901లో హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1905లో సికింద్రాబాద్లో ‘ఆంధ్ర సంవర్థనీ గ్రంథాలయం’ను నెలకొల్పారు. వార్షిక సమావేశాలు, సారస్వత సభలు ఆంధ్ర భాషా సంస్కృతుల పట్ల అభిమానం ఏర్పడేటట్లు ఈ సంస్థలు కృషి చేశాయి.