1937 నవంబర్ 16 మద్రాస్‌లోని కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం ‘శ్రీభాగ్’లో ఆంధ్ర–రాయలసీమ నాయకులు సమావేశం అయి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం జరిగిన వెంటనే మద్రాస్ శాసనసభలోని ఆంధ్ర నాయకులు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక తీర్మానం ప్రవేశపెట్టమని నాటి ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారిని కోరారు. కానీ ఆయన భారత ప్రభుత్వానికి నివేదిక పంపినా ఆమోదించలేదు.