దౌహిత్రుడు కూతురు కొడుకు=మనుమడు, జామాత అంటే అల్లుడు, ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు అని అర్ధం. బ్రాహ్మణులకు, వైశ్యులకు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేయక ముందు అతడు బాలుడు తెలియక చేసే తప్పులకు పాపం అంటదు. ఉపనయనం తర్వాత మంచి చెడు తెలుసుకొనే యుక్త వయస్కుడు, తర్వాత చేసే పాపకర్మలు తనకే చెందుతాయి, కనుక ఉపనయనం చేయక ముందు ఒక జన్మ ఉపనయనం తర్వాత ఒక జన్మగా పరిగణించి ద్విజుడు అంటారు. ఉపనయనం అయిన బ్రహ్మచారిని వటువు అని పిలుస్తారు.