1906లో ఢాకాలో ఆగాఖాన్, సలీం ఉల్లాఖాన్ మొదలగువారు అఖిల భారత ముస్లిం లీగ్‌ను స్థాపించారు. వారు బెంగాల్ విభజనను సమర్థించారు. ప్రభుత్వ రంగంలో మహ్మదీయులకు ప్రత్యేక సౌకర్యాలు కోరారు. వీరికి లార్డ్ మింటో మద్దతు ఇచ్చారు. 1909లో మింటో–మార్లే సంస్కరణల ఫలితంగా ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు మత ప్రాతిపదికపై కేటాయించారు. ఆల్ ఇండియా ముస్లీంలీగ్ ప్రధాన కేంద్రం లక్నోలో ఏర్పరిచారు.