తొలిసారి శక్తి ఆరాధనకు హారితీ దేవాలయం (నాగార్జున కొండ), పెదముడియాల మొదలగు ప్రాంతాలను ఉదహరించవచ్చు. దేవాలయాలలో సప్తమాతృకలను నెలకొల్పి ఆరాధించేవారు. చేజెర్లలో సప్తమాతృకల విగ్రహాలున్నాయి. ఆదిపరాశక్తి రూపాలే ఇవి. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి ఈ రూపాలు.