హరివర్మ తాడికొండలో శాక్యభిక్షు విహారం నిర్మించాడు. ఈయన బౌద్ధ మతాభివృద్ధికి కృషి చేశాడు. ఆదుర్రులో కూడా విహారం నిర్మించి, తండ్రి పృథ్విమూలుని నుంచి పొందిన కట్టు చెరువు గ్రామాన్ని దానం చేశాడు. మహామేఘవాహన విహారానికి కల్వచెరువును దానం చేశాడు. ఇది వర్థమానపురంలో ఉంది. గుణపాశపురంలో ఉన్న లోకవిఖ్యాత మహా విహారానికి అట్టలువుడ గ్రామాన్ని దానం చేశాడు.