రాజకీయ మార్పుల ఆధారంగా చరిత్రను విభజించడం అంతగా ఆమోదనీయం కాదు. ఎందుకంటే, చరిత్రలో అనేక రాజవంశాలు ఒక దాని వెనుక మరొకటి పరిపాలించడం జరిగింది. అందులో కొన్ని రాజ వంశాలనే విభజనకు ఆధారంగా ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తే, సరైన సమాధానం లేదు. కాబట్టి, ఈ పద్ధతి ఆమోదనీయం కాదు. అన్ని విధాల చరిత్రవిభజనకు అనుకూలమైంది, ఆర్థికపరమైన విభజన. ఆర్థికపరమైన మార్పుల ఆధారంగా చరిత్ర విభజన చేయటం ద్వారా, సామాజికాభివృద్ధి స్థాయిని గ్రహించొచ్చు. అంతేకాక, ఆర్థికపరమైన మార్పులు సమాజంలో మిగిలిన అన్ని అంశాలను ప్రభావితం చేస్తాయి.