గిర్నాల్ శాసనం – పశ్చిమ భారతదేశం మీద చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది. భట్టిఫ్రోలు శాసనం – కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి ఈ శాసనం తెలుపుతుంది. మధుర శాసనం – హావిష్కుడు అక్షయనీని పద్ధతి ప్రకారం వంద మంది బ్రాహ్మణులకు పుణ్య శాలలను, ఐదువందల పురాణాలను రెండు దానాలుగా ఇచ్చాడని తెలుపుతుంది. ఉత్తర మేరూర్ శాసనం – మొదటి పరాంతకుని గురించి తెలుపును. ఈ శాసనం దక్షిణ భరతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని తెలుపుతుంది.