అడవిని తొలగించి భూమిని సాగుచేసేందుకు అవసరమైన వ్యక్తిని గురించి మిళింద పన్హా తెల్పుతుంది, వ్యవసాయం చేసే రైతుల గురించి దివ్యావదాన తెలియజేస్తుంది. వ్యక్తి యాజమాన్యం గురించి మహావస్తు తెలియజేస్తుంది, కలుపు మొక్కలు తీసి భూమిని శుభ్రం చేసి వ్యవసాయానికి అనుగుణంగా చేసినవానికే భూమి చెందుతుందని మనుధర్మశాస్త్రం వివరించినది.