జున్నార్ శాసనం ధాన్యం వ్యాపారుల శ్రేణి ఏడు గదులు గల గుహను, జలాశయాన్ని దానంగా ఇచ్చిందని పేర్కొన్నది. హాథీగుంఫా శిలా శాసనం : కలింగ ఖారవేలుని విజయాల గురించి చెబుతున్న ఏకైక శిలా శాసనం ఇది. నానాఘాట్ శాసనం :మొదటి శాతకర్ణి సైనిక విజయాలను తెలియజేస్తుంది. దీన్ని అతని భార్య నాగనిక వేయించింది. ఐహోల్ శాసనం : బాదామి చాళుక్య పాలకుడైన రెండో పులకేశి సైనిక విజయాలను వివరిస్తుంది.