అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాలను మొదటగా వాడినది హిపార్కస్. సాధారణ శకం 46–47 లో గ్రీక్ నావికుడైన హిప్పాలస్ ఋతుపవనాలను కనుగొని అరబ్ మహాసాగరం ద్వారా నౌకాయానానికి ఉపయోగపడేటట్టు చేయడంతో, భారతీయ, పశ్చిమాసియా రేవు పట్టణాల దూరం తగ్గినట్టనిపించింది. క్లాడియస్ టాలమీ అనే అలెగ్జాండ్రియా ఖగోళ శాస్త్రవేత్త గ్రహాల తిరోగమన చలనాన్ని పరిగణనలోకి తీసుకొని, భూ కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విలియం హార్వే ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని మొదటగా వివరించాడు.