మౌర్యుల కాలంలో పన్నును గ్రామాల వారిగా మధింపు చేయడానికి భూములను వాటి నాణ్యతను బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ అని వర్గీకరించేవారు. తరువాత ఆ గ్రామాన్ని పన్ను చెల్లించే విధానాన్ని బట్టి ఈ కింది రకాల్లో దేనికి చెందుతుందో ఆ జాబితాలో చేర్చేవారు1. పన్నుల నుంచి మినహాయింపు పొందిన గ్రామాలు (పరిహారిక).2. సైనికులను సరఫరా చేసేగ్రామాలు (ఆయుధీయ)3. దాన్యం, పశువులు, బంగారం (హిరణ్య), ముడి పదార్థాలు (కుప్య) రూపంలో పన్నులు చెల్లించే గ్రామాలు4. పన్నులకు బదులుగా వెటì్ట పనిచేసేవారిని (విష్టి), పాల ఉత్పత్తులను సరఫరా చేసే గ్రామాలు.