మౌర్యుల కాలంలో వ్యవస్థీకృతమైన వ్యాపార వ్యవస్థ ఉండేది. అన్ని వివరాలు పక్కాగా రిజిస్టర్లలో నమోదు చేసుకొనేవారు. వీరి కాలంలో ప్రతి వ్యాపారి మార్కెట్ల (పణ్యశాల)లో అమ్మకాలు సాగించేందుకు లెసైన్స్ తీసుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన వ్యాపారులు పాస్ పోర్టు తీసుకోవాల్సి ఉండేది.