కాస్మాస్ అనే గ్రీకు యాత్రికుడు, భారతీయులు శ్రీలంకను ’సీల్ అడిబ’ అని పిలిచేవారు అని రాసుకున్నాడు. అలాగే మన దేశానికి ఇథియోఫియా, శ్రీలంకలతో ఉన్న వ్యాపార సంబంధాలను ఎగుమతి, దిగుమతులను పేర్కొన్నాడు. హాలుడు ప్రాకృత భాషలో ’గాథాసప్తశతి’ అనే గ్రంథాన్ని సంకలనం చేశాడు. గుణాడ్యుడు బృహత్కథ అనే గ్రంథాన్ని ప్రాకృతంలో రాశాడు. పాహియాన్ చైనా యాత్రికుడు ఇతను అనేక విషయాలను తన గ్రంథాల్లో వివరించాడు.