వేదకాలంలోనే కుల వ్యవస్థ ఉద్భవించింది. నాడు బీజ రూపంలో ఉన్న ఈ వ్యవస్థ నేడు మహావృక్షమై తన కూకటి వేళ్లను హిందూ సమాజంలో బలంగా నాటింది. ప్రస్తుతం హిందూ సమాజం మూడువేల కులాలకు పైగా విభజింపబడింది. ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే మహావీరుడు, బుద్ధుడు వంటి ప్రవక్తలందరూ మానవులంతా ఒక్కటే అనే నినదానికి దోహదం చేసారు.