ఋగ్వేదంలోని పురుష సూక్తంలో మొదటగా కుల క్రమం గురించి మనకు తెలుస్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మ( విధాత) నోటి నుంచి, క్షత్రియులు అతని బాహువుల నుంచి, వైశ్యులు అతని ఊరువుల నుంచి, శూద్రులు అతని పాదాల నుంచి సృష్టించబడినారని తెలుస్తుంది. నారాయణ సూక్తం విశ్వ ఆవిర్భావాన్ని గురించి వివరిస్తుంది. నక్షత్ర సూక్తం కాల విభజన గురించి వివరిస్తుంది.