అధర్వణ వేదం ప్రకారం గోత్రం అర్థం ‘వంశం’. దీన్ని మొదట బ్రాహ్మణ తరగతి వారు పాటించారు. తర్వాత ద్విజులందరూ పాటించసాగారు. చివరగా అందరూ పాటించారు. వివాహా సమయాల్లో ఈ గోత్ర ప్రాధాన్యత కనిపిస్తుంది. సొంత గోత్రికులందరినీ రక్త సంబంధీకులుగా పేర్కొంటారు. అందుకే స్వగోత్రికుల్లో వివాహాలు జరగవు.