కులం అంటే కొంతమంది వ్యక్తుల సముదాయం. అంటే ఆ వ్యక్తులకు పితృపరంగా వృత్తి లభిస్తుంది. సంప్రదాయంగా, వారసత్వంగా లభించిన హక్కులు, బాధ్యతలు, భావాల మూలంగా వారంతా ఒక వ్యవస్థగా కలిసి ఉంటారు. వారికి కొన్ని నియమాలను ఐక్యంగా అమర్చుకొని వాటిని తమ వృత్తి, ఆహార నియమాల్లోను, వివాహ సంప్రదాయాల్లోనూ అమలు పర్చుకొంటారు.