మలి వేదకాలంలో వర్ణాశ్రమ ధర్మం మిక్కిలి ప్రాచుర్యం వహించింది. ఇది ఒక సాంఘిక సూత్రం. జీవితాన్ని నాలుగు విభాగాలుగా చేసి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు నిబద్దం చేశారు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యను అభ్యసించి, గృహస్థాశ్రమ సమయంలో గృహస్తు జీవితం గడపడం. వానప్రస్థాశ్రమంలో జ్ఞానసముపార్జన చేయడం, సన్యాసాశ్రమంలో పూర్తిగా భవ బంధాలను తెంచుకుని పరమాత్మలో ఐక్యం చెందడానికి కృషిసల్పడం అనే నిబంధనలు ఏర్పడ్డాయి.