వ్రత్యులకు మొదట వైదిక మతంతో సంబంధం ఉండేది కాదు. వీరు ప్రాకృత భాషను మాట్లాడేవారు. స్థిరనివాసులు కారు, వీరికి మగధయందలి దస్యులతో సంబంధం ఉండేది. వీరినే తర్వాతి కాలంలో వైదిక సంఘంలోకి చేర్చుకున్నారు. నిషాదులు (వేటగాళ్లు), కైవర్తులు (చేపలు పట్టేవారు), కారావారులు (చర్మకారులు) వీరందరూ చండారులలోని వివిధ తెగలవారే.